శ్రీశైలం జలాశయం పరిసరాల్లో చేపల వేటపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జులై, ఆగస్టులో చేపల సహజ సంతానోత్పత్తి కాలమని, ఆ సమయంలో జలాశయం బ్యాక్ వాటర్స్‌లో వేటకు వెళ్లొద్దని ఆదేశించింది. కాగా రెండు రోజుల క్రితం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ఆగిపోవడంతో మత్స్యకారులు చేపల వేటకు దిగారు. ఈ నేపథ్యంలో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.