AP: తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి ఇసుక ర్యాంప్‌లో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. మహాశివరాత్రి సందర్భంగా గోదావరి స్నానానికి వెళ్లిన ఐదుగురు యువకులు నదిలో దిగి గల్లంతయ్యారు. గల్లంతైన యువకులు పవన్, దుర్గా ప్రసాద్, ఆకాష్, పడాల సాయి, తిరుమల శెట్టి పవన్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరకుని గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.