AP: తిరుపతిలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. చిల్లకూరులోని చిల్డ్రన్స్ హోంలో భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పి, వాంతులతో బాధ పడ్డారు. దీంతో వారందరిని ఆస్పత్రికి తరలించారు. మిగిలిపోయిన బిర్యానీని టిఫెన్‌గా పెట్టడం వల్ల అస్వస్థతకు గురైనట్లు విద్యార్థులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా విద్యార్థులను పరామర్శించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.