AP: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై భూమి కబ్జా కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో వంశీని కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణా జిల్లా ఆత్కూరులో వంశీ 8 ఎకరాల భూమిని కబ్జా చేశారని, ఈ కేసులో మరింత లోతుగా విచారించాలని పిటిషన్‌లో దాఖలు చేశారు. బెయిల్ ఇవ్వాలని వంశీ తరపున వాదనలు వినిపించగా.. దీంతో విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఆ రోజే తీర్పు ఇస్తామని న్యాయమూర్తి వెల్లడించారు