24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు: నాదెండ్ల

72చూసినవారు
24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు: నాదెండ్ల
AP: ధాన్యం కొనుగోలు చేసిన 24గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శుక్రవారం తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం యాతలూరులో ఆయన రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా దళారులకు చోటు లేదన్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు రైతుల నుంచి 36 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు.

సంబంధిత పోస్ట్