వైఎస్ షర్మిలకు మాజీ మంత్రి రోజా కౌంటర్

81చూసినవారు
వైఎస్ షర్మిలకు మాజీ మంత్రి రోజా కౌంటర్
AP: వైఎస్ వివేకాకు గుండెపోటు అని చెప్పిన టైంలో సునీత లేదని, అప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారని నిన్న వైఎస్ షర్మిలా చెప్పారు. వైఎస్ వివేకా కేసులో సాక్షులు చనిపోతున్నారని, సునీత ప్రాణాలకు రక్షణ లేదన్నారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. ‘వివేకా హత్య జరిగినప్పుడు చంద్రబాబే అధికారంలో ఉన్నారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం రూపొందించిన కుట్రలో మీరొక సాధనంగా మారారు. నిర్దోషులను బలి చేయాలన్న ఆరాటం ఎందుకు?.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్