తల్లితో గొడవ.. విషం తాగి కూతురు మృతి

81చూసినవారు
తల్లితో గొడవ.. విషం తాగి కూతురు మృతి
AP: విజయవాడకు చెందిన రమాదేవీ భర్త చనిపోవడంతో ఆమె వెంకటేశ్వరరావు అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయంపై ఆమె చిన్న కుమార్తె మౌనిక (28) మొదటి నుంచి విభేదిస్తూ వస్తోంది. తన తండ్రి చనిపోయినప్పుడు వచ్చిన బీమా డబ్బులు కొంత ఇవ్వమని తల్లిని అడిగింది. ఇద్దరూ గొడవ పడ్డారు. దాంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మౌనిక తన భర్త కృష్ణశంకర్, అక్క విజయలక్ష్మికి ఫోన్ చేసి చనిపోతానని చెప్పింది. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్