నిత్యం ఎక్కడో ఒకచోట మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యాపిల్లలతో రక్సెల్ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ వెళ్తున్నారు. అర్థరాత్రి 2 గంటలకు అతడి పెద్ద కూతురు(12) వాష్‌రూమ్‌కి వెళ్లగా ఆమె వెనుకే వెళ్లిన ఓ వ్యక్తి అరగంట పాటు బాలికను బంధించి వేధించాడు. వాటిని ఫోన్‌లో రికార్డ్ చేశాడు. అతను వదిలిపెట్టిన తర్వాత బాలిక పేరెంట్స్‌కు చెప్పడంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. .