తమ యూనివర్సిటీ భూమిని కాపాడుకోవడానికి ఎంతటి పోరాటమైనా చేస్తామని హెచ్‌సీయూ విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. వారు మాట్లాడుతూ.. 'ఇక్కడ ఇన్ని చెట్లు నరికేశారు. ఉగాది రోజు పోలీసులు మా పైన లాఠీ ఛార్జ్ చేశారు. ఓ విద్యార్థి నిరాహార దీక్షకు దిగితే, పోలీసులు అతన్ని తీసుకెళ్లి దాచిపెట్టారు. మా క్యాంపస్ లో మేము తిరగడానికి నిర్బంధం ఏంటి? మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా మా భూమి కోసం మా పోరాటం ఆగదు' అని అన్నారు.