TG: రన్నింగ్‌లో ఉన్న ఓ ఆటోపై గోడ ఒక్కసారిగా కూలింది. హైదరాబాద్ కర్మన్ ఘాట్‌లో ఓ గోడ పక్కనుంచి ప్రయాణికులతో ఉన్న ఆటో వెళ్తుండగా ప్రహరీ కుప్పకూలింది. దీంతో ఆటోలో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. ప్రహరీ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బిల్డింగ్ యజమానులపై చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.