ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నేడు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై చంద్రబాబు సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఈ పథకాన్ని అమలు చేయడం సరికాదని కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.