ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం

62చూసినవారు
గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. ప్రస్తుతం 13.75 అడుగులకు నీటి మట్టం చేరడంతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 13 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గణేష్ నిమజ్జనాలను రానున్న 48 గంటలు గోదావరి నది తీరాల్లో నిర్వహించవద్దని వారు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్