తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఓజిలి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. పెద్ద శబ్ధం రావడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ప్రమాద సమయంలో వంట గదిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. వారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. స్థానికులు మంటలను అదుపులోకి తీసుకు రావడంతో పెను ప్రమాదం తప్పింది.