AP: ఏఐ సాంకేతికతతో రూపొందించిన ‘పురమిత్ర’ యాప్‌ను సీఎం చంద్రబాబు శనివారం తణుకులో ప్రారంభించినట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ కుమార్ తెలిపారు. ఈ యాప్ పట్టణ సేవలను ఫోన్‌లోనే అందించి, పౌరులకు స్మార్ట్ అర్బన్ గుడ్ గవర్నెన్స్ అనుభవాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. నీటి సరఫరా, ఆస్తి పన్ను, ప్రజారోగ్యం, పరిశుభ్రత వంటి సమస్యలపై ఫిర్యాదులను ఈ యాప్‌లో అందించవచ్చన్నారు.