డీజే సౌండ్ తగ్గించమన్నందుకు.. చంపేశాడు

51చూసినవారు
డీజే సౌండ్ తగ్గించమన్నందుకు.. చంపేశాడు
మధ్యప్రదేశ్‌లోని మైహార్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. మంకీసర్ గ్రామం రాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శంకర్ అనే వృద్ధుడు నివసిస్తున్నాడు. హోలీ సందర్భంగా పక్కింట్లో ఉన్న దీపు కేవత్ డీజే సౌండ్ పెట్టాడు. సౌండ్ తగ్గించమని దీపు కేవత్‌ను అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి కేవత్‌ తన కుటుంబసభ్యులతో కలిసి వృద్ధుడిని కొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే చనిపోగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్