ఇవాళ్టి నుంచి ఒడిశాలో మిధున సంక్రాంతి వేడుకలు

66చూసినవారు
ఇవాళ్టి నుంచి ఒడిశాలో మిధున సంక్రాంతి వేడుకలు
తెలుగు ప్రజలు నిర్వహించుకునే మకర సంక్రాంతి పండగ మాదిరిగా ఒడియా ప్రజలు ‘మిధున సంక్రాంతి’ని మూడు రోజులు నిర్వహించుకోవడం ఆనవాయితీ. సూర్యుడు మిధున రాశిలో ప్రవేశించడాన్ని ‘రొజ్జొ’ అంటారు. శనివారం మిధున సంక్రాంతి. దీనికి ఒక్క రోజు ముందుగా (శుక్రవారం) ‘పొహెలి రొజ్జొ’ (తొలి రొజ్జొ) ఆచరిస్తారు. ఇంటింటా పిండి వంటకాలు, నూతన వస్త్రధారణ, బోటు షికార్లు, చిన్నారుల తుళ్లింతలతో రొజ్జొ పండగ సందడిగా జరుగుతుంది.

సంబంధిత పోస్ట్