AP: అధికారం చేపట్టిన 9 నెలల్లోనే కూటమి సర్కార్ ప్రజలకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. విద్యుత్ ఛార్జీల నుంచి ప్రజలకు ఊరట కల్పించింది. పలు డిస్కంల పరిధిలో దాదాపు రూ.1000 కోట్ల వరకు ట్రూడౌన్‌ను ఏపీ ట్రాన్స్‌కో ప్రకటించింది. ట్రూడౌన్ అంటే డిస్కం ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకుండా ఉత్పత్తి ధరకే విద్యుత్ ను అందిస్తుంది. అదనపు ఛార్జీలు లేకపోవడంతో కరెంట్ ఛార్జీలు భారీగా తగ్గే అవకాశం ఉంది.