తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేలో 3.55 కోట్ల మంది వివరాలు నమోదు చేశామని సీఎం రేవంత్ అసెంబ్లీలో వెల్లడించారు. ఫేజ్-1లో 1,12,15,134 కుటుంబాలు పాల్గొన్నాయని.. 3,54,77,552 మంది వివరాలు ఇచ్చారని తెలిపారు. ఇక ఫేజ్-2లో 21,715 కుటుంబాలు పాల్గొన్నాయని.. 73, 0205 మంది వివరాలు ఇచ్చారని పేర్కొన్నారు. మొత్తంగా 3,55,50,759 మంది పూర్తి వివరాలు ఇచ్చారని సీఎం స్పష్టం చేశారు.