జార్ఖండ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జగన్నాథ్‌పూర్ PS పరిధిలోని పువాల్‌లో సోమవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నలుగురు పిల్లలు సజీవ దహనం అయ్యారు. కాగా, చనిపోయిన మృతులంతా దాదాపు ఐదు సంవత్సరాల వయసు గలవారని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో పిల్లలు గడ్డి కుప్ప దగ్గర ఆడుకుంటున్నారని పోలీసులు తెలిపారు. చిన్నారుల మరణంతో పువాల్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.