ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్య ఘటనపై AP డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. నాగాంజలి ఆత్మహత్య దురదృష్టకరమన్న ఆయన, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సూసైడ్ నోట్ ఆధారంగా ఆస్పత్రి ఏజీఎం దీపక్‌ను ఇప్పటికే అరెస్ట్ చేశారని చెప్పారు. బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థినులు, యువతుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పవన్ పేర్కొన్నారు.