గన్నవరం ఎయిర్‌పోర్టులో తుపాకీ కలకలం

60చూసినవారు
గన్నవరం ఎయిర్‌పోర్టులో తుపాకీ కలకలం
AP: గన్నవరం విమానాశ్రయంలో తుపాకీ కలకలం రేపింది. భద్రతా సిబ్బంది తనిఖీల్లో ఓ యువకుడి వద్ద తుపాకీతో పాటు రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఓ ప్రైవేటు యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నట్టుగా గుర్తించారు. గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్తున్న సదరు విద్యార్థిని భద్రతా సిబ్బంది అనుమానించి తనిఖీ చేశారు. రెండు బుల్లెట్లు లభించడంతో వెంటనే అతడిని గన్నవరం పోలీసులకు అప్పజెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్