TG: BRS నాయకులపై మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. BRS నేతలకు అధికారం పోయిన తర్వాత కార్యకర్తలు గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫామ్‌హౌస్‌లో పడుకుని కేటీఆర్ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ను తెలంగాణ ప్రజలు వద్దు అనుకున్నారు కాబట్టే కాంగ్రెస్‌ను గెలిపించారని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడే అర్హత BRS నేతలకు లేదన్నారు.