ఏపీలో ఈ నెల 14 నుంచి సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. తొలిరోజు సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, రెండోవ రోజు డిస్ట్రిబ్యూషన్ కమిటీలు, 3వ రోజు ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. రైతాంగాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో తమ ప్రభుత్వం 2015లో ఈ ఎన్నికలు నిర్వహించిందని తెలిపారు. అయితే 2020లో గత ప్రభుత్వం ఈ సంఘాలను రద్దు చేసిందన్నారు.