దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. గురువారం కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు రాణించాయి. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్ దాదాపు 1500 పాయింట్ల మేర లాభాపడ్డాయి. దీంతో సెన్సెక్స్ 809.53 పాయింట్ల లాభంతో 81,765.86 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 240.95 పాయింట్లు లాభంతో 24,708.40 వద్ద స్థిరపడింది. ప్రస్తుతం డాలరుతో రూపాయి మారకం విలువ 84.72గా ఉంది.