సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) ప్రీ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు అఫీషియల్ వెబ్‌సైట్ ctet.nic.in నుంచి ఈ పరీక్ష సిటీ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షా సిటీ స్లిప్ అనేది పరీక్షా కేంద్రాల సిటీ, తేదీ గురించి తెలియజేస్తుంది. విద్యార్థులు తమ CTET 2024 అడ్మిట్ కార్డులో పరీక్షా కేంద్రం చిరునామా, రిపోర్టింగ్ సమయం, ఇతర కీలక సమాచారాన్ని పొందుతారు.