పల్నాడు: గుండెపోటుతో వ్యక్తి మృతి
గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన నాదెండ్ల మండలం గణపవరం ధనలక్ష్మి స్పిన్నింగ్ మిల్లు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి ధనలక్ష్మి స్పిన్నింగ్ మిల్లుకు దారాన్ని లోడ్ చేసుకునేందుకు వచ్చిన డ్రైవర్ హఠాత్తుగా కన్నుమూశారు. మృతుడికి సంబంధించిన వివరాలను నాదెండ్ల పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.