చిలకలూరిపేట: పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలి
రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం మంగళగిరి లోని ఏపీఐఐసీ భవన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రీజినల్ రెవెన్యూ సదస్సులో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చిలకలూరిపేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన ఆర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై సంబంధిత అధికారులను మాజీ మంత్రి ప్రశ్నించారు. సమస్యల పరిష్కారానికి తగిన చొరవ చూపాలన్నారు.