చిలకలూరిపేటలో కొండచిలువ హల్ చల్
చిలకలూరిపేటలోని పలు ప్రాంతాల్లో 2 రోజుల నుంచి పాములు హల్ చల్ చేస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పట్టణంలోని ఇస్లాంపేట బజార్ చివరిలో పాములు ఎక్కువయ్యాయి. బుధవారం ఒక ఇంట్లో మూడు పాములు కనిపించాయి. మళ్లీ బుధవారం 13 అడుగుల పెద్ద కొండచిలువ రావటంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి ఖాళీ ప్రదేశాల్లో పిచ్చి చెట్లు తొలగించాలని విజ్ఞప్తి చేశారు.