చిలకలూరిపేట: న్యూఇయర్ వేడుకలకు దూరంగా టీడీపీ శ్రేణులు
న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలని చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర్ణయం తీసుకున్నారు. కొద్దికాలం క్రితం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాతృమూర్తి నారాయణమ్మ మృతి చెందిన నేపథ్యంలో ప్రత్తిపాటి నివాసం వద్ద ఈ సంవత్సరం నిర్వహించాల్సిన నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులు మంగళవారం నిర్ణయించారు. ఈ విషయాన్ని నియోజకవర్గ టీడీపీ శ్రేణులు గమనించాలని సూచించారు.