గుంటూరులో రేపటి నుంచి నీటి సరఫరా బంద్
గుంటూరు నగరంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు సంజీవయ్య నగర్ రైల్వేగేటు వద్ద ప్రధాన పైపులైన్ లీకేజీ కారణంగా నీరు వృథా అవుతుందని, నీటి వృథాను అరికట్టే క్రమంలో శుక్రవారం నుంచి మరమ్మతులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఆదివారం ఉదయం పాక్షికంగా, సాయంత్రం యథాతథంగా నీటి సరఫరా జరుగుతుందన్నారు.