మంగళగిరి రూరల్ ఎస్ఐ కు ఉత్తమ సేవా పత్రం

63చూసినవారు
మంగళగిరి రూరల్ ఎస్ఐ కు ఉత్తమ సేవా పత్రం
ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందిన మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం మంత్రి నారా లోకేష్, కలెక్టర్ నాగలక్ష్మీ చేతుల మీదుగా ఎస్ఐ వెంకట్ ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మంగళగిరి రూరల్ స్టేషన్ సిబ్బందితో పాటు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్