విజయకీలాద్రిలో ఘనంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

77చూసినవారు
విజయకీలాద్రిలో ఘనంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు
తాడేపల్లి పరిధి సీతానగరంలోని త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న విజయకీలాద్రి క్షేత్రంపై గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు జెండా వందనం చేశారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులని స్మరించుకుంటూ జాతీయగీతాన్ని పాడారు. కార్యక్రమంలో వేద విద్యార్థులు, అర్చక బృందం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్