మంగళగిరి సీతారాముల ఆలయంలో నారా బ్రాహ్మణి

51చూసినవారు
మంగళగిరి పట్టణం కుప్పరావు కాలనీలో ఉన్న సీతారాముల ఆలయం వద్ద ఆదివారం ఆలయ కమిటీ సభ్యులు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నారాలోకేష్ సతీమణి బ్రహ్మణి పాల్గొన్నారు. తొలుత సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నసమారాధనను ప్రారంభించారు. ఈ సందర్బంగా స్థానిక మహిళలు నూలు వస్త్రాలను బ్రహ్మణికి బహుకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్