కాకుమాను మండలంలో వైసీపీ అభ్యర్థి బలసాని ఎన్నికల ప్రచారం

81చూసినవారు
గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని కొమ్మూరు, గార్లపాడు, కొండపాటూరు గ్రామాల్లో శుక్రవారం వైసిపి అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ ర్యాలీ నిర్వహించి ఆయా గ్రామాల్లో ఉన్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని ప్రజలను కోరారు. జడ్పిటిసి సభ్యురాలు ముజావర్ గుల్జార్ బేగం, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్