తుళ్లూరు: ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం: సీఎం
ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం. ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయంలో 75వ రాజ్యాంగ దినోవ్సవదినోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం అన్ని మతాలకు పవిత్ర గ్రంథమన్నారు. ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా అమలు చేసే వారు మంచి వారు కాకపోతే అది చెడుగా మారుతుందని పేర్కొన్నారు.