తెనాలి డిపో నుంచి పంచారామాలకు ప్రత్యేక బస్సులు
కార్తీక మాసం సందర్భంగా ప్రతి శని, ఆదివారాల్లో తెనాలి డిపో నుంచి పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ఆదివారం తెనాలిలో ఆయన మాట్లాడుతూ సామర్లకోట ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం, అమరావతి పుణ్య క్షేత్రాలను ఒక రోజులోనే సందర్శించుకొని తెనాలి చేరుకోవడం జరుగుతోందన్నారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.