అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు బుధవారం తెప్పోత్సవం కార్యక్రమాన్ని కనుల పండగగా నిర్వహించారు. వేద పండితుల వేదమంత్రాలు నడుమ, తొలుత మేళ తాళాలతో స్వామివారి ఊరేగింపును నిర్వహించారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు నియోజకవర్గం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.