అద్దంకి పట్టణంలో ఈనెల 25వ తేదీన అర్ధరాత్రి సమయంలో శ్రీరామ్ ఏజెన్సీ నందు దొంగతనానికి పాల్పడిన ముద్దాయిలను చీరాల డిఎస్పి మహమ్మద్ మెయిన్ పర్యవేక్షణలో పోలీసులు మంగళవారం కొంగపాడు డొంక వద్ద పట్టుకున్నారు. డిఎస్పి మహమ్మద్ మెయిన్ మాట్లాడుతూ బెల్లంకొండ విజయ్, సాయి సూర్య తేజలు పలు జిల్లాలలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. వారి వద్ద నుంచి 18. 14 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.