కొరిశపాడు: ప్రభుత్వ వైద్యశాల తనిఖీ

59చూసినవారు
కొరిశపాడు: ప్రభుత్వ వైద్యశాల తనిఖీ
కొరిశపాడు గ్రామంలో ప్రాథమిక వైద్యశాలను మంగళవారం జిల్లా ఆరోగ్యశాఖ అధికారిణి విజయమ్మ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రికార్డులను ఆమె పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు గురించి ఆమె డాక్టర్ అక్షిత, రాజశేఖర్ లను అడిగి తెలుసుకున్నారు. నూతన ఆరోగ్య కేంద్రం భవనం నిర్మాణం గురించి ఆరా తీశారు. ఆసుపత్రిలో ప్రజలకు అందిస్తున్న సేవల పట్ల విజయమ్మ సంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్