కోరిశపాడు మండలం, మేదరమెట్ల బస్ స్టేషన్ నందు, ఆర్టీసీ ఆవరణంలో నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా దుకాణాలను నిర్మించి, వ్యాపారాలు కొనసాగిస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని, బుధవారం అద్దంకి ఆర్టీసీ డిపో మేనేజర్ రామ్మోహన్ తెలియజేశారు. ఆ స్థలాలకు సంబంధించి టెండర్ ప్రకటన విడుదల చేశామని, మొత్తం 14 షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. దరఖాస్తు ఫారంలు అద్దంకి డిపో కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని సూచించారు.