పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి చీరాలలో ప్రదర్శన నిర్వహించింది. సమితి అధ్యక్షుడు గుడివాడ వేణుగోపాల్, బాపట్ల జిల్లా అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు తదితరులు అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి పేరు మారిస్తే ఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు.