అద్దంకి ఆర్టీసీ డిపో కార్యాలయం నందు బుధవారం డయల్ యువర్ డిఎం కార్యక్రమం ఉంటుందని మేనేజర్ రామ్మోహన్ రావు తెలియజేశారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ కార్యక్రమంలో ఫోన్ చేసి వివరించవచ్చని ఆయన చెప్పారు. సాయంత్రం నాలుగు నుండి ఐదు గంటల వరకు కార్యక్రమం ఉంటుందని రామ్మోహన్ రావు పేర్కొన్నారు. 9959225696 నెంబర్ కు డయల్ చేయాలని ఆయన సూచించారు.