స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరిట మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల పై అప్రమత్తంగా ఉండాలని బాపట్ల ఎస్పీ తుషార్ డ్యూటీ పేర్కొన్నారు. ఆదివారం బాపట్ల ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో వచ్చే లింక్ లు క్లిక్ చెయ్యొద్దన్నారు. సైబర్ నేరం జరిగిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కాల్ చేయడం ద్వారా కాని https://cybercrime.gov.in అనే వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.