బాపట్ల జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ సేవలు ఆపదలో ఉన్న ప్రజలకు మరింత చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అన్నారు. సోమవారం తాసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలోని రెడ్ క్రాస్ చారిత్రిక స్థూపాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. తుఫాన్లు, విపత్తులు సంభవించి నప్పుడు సహాయ కార్యక్రమాలు అందించడానికి రెడ్ క్రాస్ బృందం సిద్ధంగా ఉండాలని సూచించారు. వారి సేవలు అభినందనీయమన్నారు. సంస్థ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.