బాపట్ల జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ప్రతి ఒక్కరికి బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట మురళి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఏర్పడిన జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరు సమన్వయంతో కృషి చేయాలని ఆయన కోరారు. జిల్లా ప్రజలందరూ ఈ ఏడాది సుఖ సంతోషాలతో ఉండాలని పరిపాలనకు సహకరించాలని అభిలషించారు.