బాపట్ల పట్టణంలోని రైతు బజార్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకట మురళి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల స్టాల్స్ ను ప్రారంభించారు. వివిధ రకాల కూరగాయలు చిరుధాన్యాలు స్టాల్స్ ను సందర్శించి ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రాధాన్యతను ప్రజలు తెలుసుకొని వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. డిఆర్డిఏ అధికారులు పాల్గొన్నారు.