బాపట్ల ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశాలలో పాల్గొని డిప్యూటీ స్పీకర్ కు వివరించారు. సూర్యలంక సముద్ర తీర నుండి చీరాల మధ్యలో వంతెన నిర్మాణం చేపడితే పర్యాటకంగా రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని కోరారు. ఇప్పటికే ఫైవ్ స్టార్ హోటల్స్ నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.