బాపట్ల: కలెక్టర్ ఫోన్ నెంబర్ దుర్వినియోగం చేస్తున్న హ్యాకర్ లు

76చూసినవారు
బాపట్ల: కలెక్టర్ ఫోన్ నెంబర్ దుర్వినియోగం చేస్తున్న హ్యాకర్ లు
హ్యాకర్లు వివిధ ఫోన్ నెంబర్లతో జిల్లా కలెక్టర్ గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి మంగళవారం తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు కలెక్టర్ ఫోటో, గుర్తింపు చిహ్నాలతో ఎవరికైనా ఎలాంటి సందేశాలు వచ్చినా స్పందించరాదని తెలిపారు. +94724297132 ఈ నెంబర్ నుంచి కలెక్టర్ పేరుతో కొందరికి మెసేజ్ లు వెళ్లాయి అన్నారు.

సంబంధిత పోస్ట్