బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (జి ఓ ఐ)అభివృద్ధి సమన్వయం పర్యవేక్షణ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో బపట్ల ఎంపీ తేన్నేటి కృష్ణ ప్రసాద్, కలెక్టర్ జె వెంకట మురళి, సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులతో పాటు చేపట్టవలసిన పనులపై సమీక్షలో చర్చించారు.