రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారయ్యిందని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి శుక్రవారం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడిన ఆయన, డిసెంబర్ 7వ తేదీన సీఎం తొలిసారిగా జిల్లాకు రానున్నట్లు వెల్లడించారు. బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగే "మెగా పేరెంట్ టీచర్ మీటింగ్" లో సీఎం పాల్గొంటారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని ఆయన కోరారు.